21 రోజుల దేశం మొత్తం లాక్ డౌన్: ప్రధాని మోదీ

ఇవాళ అర్థరాత్రి నుంచి 21 రోజులపాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రసంగించారు. జాతినుద్దేశించి ప్రసగించిన ప్రధాని మోదీ, ఇల్లు విడిచి బయటకు రావటాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. జనతా కర్ఫ్యూను మించి లాక్​ డౌన్ ​ను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి లాక్​ డౌన్​ నిర్ణయం లక్ష్మణ రేఖ వంటిదన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజలందరూ సామాజిక దూరం పాటించటమే మార్గమని తెలిపారు.  నిత్యావసరాలను ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సరఫరా చేస్తామన్నారు. ఈ 21 రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండి, దేశాన్ని కాపాడుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.