హిందీ డైలాగులతో అదరగొట్టిన క్రిస్ గేల్

వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌ మన్‌ క్రిస్‌ గేల్‌ తన బ్యాట్‌తో ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేయడమే తెలుసు. కానీ తనదైన శైలిలో హిందీ డైలాగులు చెప్తూ నవ్వులు పూయించాడు ఈ స్టార్ క్రికెటర్. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, సిక్సుల వీరుడు యువరాజ్‌ సింగ్‌తో కలిసి గేల్‌ ఒక సరదా వీడియో చేశాడు.  ఈ సందర్భంగా ఓ హిందీ డైలాగ్‌ చెప్పి నవ్వులు పూయించాడు. ఆ వీడియోలో యువీ.. గేల్‌ వెనుక ఉండి డైలాగ్‌ను అందివ్వడం కనిపించింది. దీంతో గేల్‌ చాలా హాస్యాస్పదంగా ఆ డైలాగ్‌ చెప్పాడు. నా ఆత్మవిశ్వాసంతో నీ చావుకు సమాధి కడతా అనే అర్థం వచ్చేలా విండీస్‌ క్రికెటర్‌ ఈ డైలాగ్ చెప్పాడు. దీంతో యువీ యూనివర్స్‌ బాస్‌ పలికిన సంభాషణకు నవ్వులు ఆపుకోలేకపోయాడు. గేల్‌ ఈసారి ఐపీఎల్‌లో కింగ్స్‌ XI పంజాబ్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు.