సీఎం సహాయనిధికి పలువురు ప్రముఖుల విరాళం

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా, లాక్‌డౌన్ సందర్భంగా పేదల నిత్యవసర సరుకుల సరఫరా కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలకు పలువురు ప్రముఖులు విరాళం ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేడ్ల సతీమణి అనుపమ వేణుగోపాల్ నాదేళ్ల ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్‌ను అనుపమ తండ్రి, మాజీ ఐఏఎస్‌ అధికారి కే.ఆర్‌.వేణుగోపాల్‌ సీఎం కేసీఆర్‌ కు అందించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఒకరోజు మూలవేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్ ను ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు కారం రవీందర్‌ రెడ్డి, మమత సీఎం కేసీఆర్‌ కు అందించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒకరోజు వేతనం రూ.48 కోట్లు సీఎం సహాయనిధికి ఇస్తున్నట్లు నాయకులు చెప్పారు. సినీహీరో నితిన్ రూ.10 లక్షల చెక్‌ ను సీఎం కేసీఆర్‌ కు అందించారు. సీఎం సహాయనిధికి విరాళాలు అందించిన వారికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

సీఎం కేసీఆర్, మమత, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్
                     సీఎం కేసీఆర్, మమత, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్
సీఎం కేసీఆర్, మాజీ ఐఏఎస్ వేణుగోపాల్
సీఎం కేసీఆర్, మాజీ ఐఏఎస్ వేణుగోపాల్