వాల్ మార్ట్‌లో లక్ష ఉద్యోగుల నియామకం

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు రోడ్డున పడుతుంటే రిటైల్‌ దిగ్గజం వాల్‌ మార్ట్‌ మాత్రం జాబ్స్‌ మేళా ప్రారంభించింది. రిటైల్‌ దుకాణాలలో పనిచేసేందుకు లక్షమందికి పైగా కార్మికులను నియమిస్తామని ప్రకటించింది. వీరిలో పూర్తి సమయం పనిచేసే కార్మికులకు 300 డాలర్లు, తాత్కాలికంగా పనిచేసే కార్మికులకు 150 డాలర్ల బోనస్‌ ఇవ్వాలని కంపెనీ భావిస్తోంది. కార్మికల నియామకాలను మే చివరి నాటికి పూర్తి చేస్తామని తెలిపింది వాల్‌మార్ట్‌. కొత్తగా విధుల్లో చేరిన కార్మికులు రిటైల్‌ స్టోర్స్‌, క్లబ్స్‌, పంపిణీ కేంద్రాల్లో విధులను నిర్వర్తిస్తారని ప్రకటించింది. వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించే విధంగా ఈ నియామకాలను చేపడతామని వెల్లడించింది.