లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

కరోనా దెబ్బకు పాతాళానికి పతమైన దేశీయ మార్కెట్లు నెమ్మదిగా కోలుకుంటున్నాయి. వరుసగా మూడో రోజూ లాభాల బాటలో పయనించాయి.  లాక్‌డౌన్‌  విధించిన వేళ కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం మదుపరుల్లో ఉత్సాహం నింపింది. సెన్సెక్స్‌14 వందల 10 పాయింట్లు లాభపడి 29 వేల 946 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 323 పాయింట్ల లాభంతో 8వేల 641 దగ్గర స్థిరపడింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్‌, లార్సెన్‌, బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్ప్‌  షేర్లు లాభపడగా..  యెస్‌ బ్యాంకు, గెయిల్‌, అదానీ పోర్ట్స్‌, సన్‌ఫార్మా, మారుతీ సుజుకీ మొదలైన షేర్లు నష్టాలను చవి చూశాయి.