లాక్‌డౌన్ సరిపోదు.. వైరస్‌పై అటాక్ చేయండి: WHO

కరోనా నివారణకు కేవ‌లం లాక్‌డౌన్ చ‌ర్యలు సరిపోవన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌. మ‌హ‌మ్మారిని రూపుమాపాలంటే మ‌రింత దూకుడుగా వ్యవహరించాలన్నారు.  క‌ఠిన చర్యలు తీసుకోవాల‌న్నారు. కరోనా బాధితులను వేగంగా గుర్తించి.. వారిని ఐసోలేట్ చేయాలన్నారు. సామాజిక‌, ఆర్థిక ఆంక్షలతో పాటు క‌ఠిన నియ‌మాలు పాటిస్తేనే కరోనాను ఎదుర్కోగ‌ల‌మ‌న్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలోనే వైర‌స్‌పై అటాక్ చేయాల‌ని ప్రపంచ దేశాలకు దేశాల‌కు పిలుపునిచ్చారు. ప్రజా ఆరోగ్య వ్యవస్థను విస్తరించాలన్నారు. ప‌బ్లిక్ హెల్త్ వ‌ర్క్‌ ఫోర్స్‌ ను పెంచుకోవాల‌న్నారు. క‌మ్యూనిటీ స్థాయిలోనే అనుమానిత కేసుల‌ను గుర్తించే వ్యవస్థను రూపొందించుకోవాల‌న్నారు. అనుమానితుల‌కు పరీక్షలు నిర్వహించేందుకు కావాల్సిన వైద్య ప‌రిక‌రాల‌ ఉత్పత్తి, సామ‌ర్ధ్యాన్ని పెంచుకోవాల‌న్నారు.