లాక్‌డౌన్‌ను ప్రజలు తీవ్రంగా పరిగణించడంలేదు

కరోనా వైరస్ నియంత్రణకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు సహకరించాలని కోరారు ప్రధాని నరేంద్ర మోదీ. చాలా మంది లాక్ డౌన్ ను తీవ్రంగా పరిగణించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనలను పాటించాలని.. నియమాలు, చట్టాలను అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించి తమను తాము రక్షించుకోవాలని..తమ కుటుంబాన్ని రక్షించుకోవాలని ట్విట్టర్లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రధాని మోదీ