రేపు స్వదేశానికి వెళ్లనున్న సౌతాఫ్రికా టీమ్

భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఆడడానికి వచ్చిన దక్షిణాఫ్రికా జట్టు రేపు కోల్‌కతా నుంచి స్వదేశానికి తిరుగు ప్రయాణంకానుంది ప్రస్తుతం లక్నోలో ఉన్న ఆ జట్టు ఇవాళ కోల్‌కతా చేరుకుంటుంది. అక్కడి నుంచి మంగళవారం ఉదయం దక్షిణాఫ్రికాకు పయనమవుతుందని బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అభిషేక్‌ దాల్మియా  చెప్పారు. బీసీసీఐ వారికి తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని వెల్లడించారు.  భారత్‌తో సిరీస్‌ వాయిదా పడ్డాక సఫారీ ఆటగాళ్లు వాలీబాల్‌ ఆడుతూ కనిపించారు. క్రికెట్‌ దక్షిణాఫ్రికా బోర్డు ఆ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేసింది. మార్చి 12 నుంచి 18 వరకు భారత్‌- దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ జరగాల్సి ఉంది. ధర్మశాలలో తొలి వన్డే టాస్‌ కూడా పడకుండా వర్షం వల్ల రద్దైంది. కరోనా కారణంగా మిగతా సిరీస్‌లు రద్దయ్యాయి.