రూ.3కే కిలో బియ్యం.. రూ.2కే కిలో గోధుమలు: కేంద్రమంత్రి

80 కోట్ల మందికి ప్రత్యేక రేషన్‌ ద్వారా 3 రూపాయలకే కిలో బియ్యం, 2రూపాయలకే కిలో గోధుమలు సరఫరా చేస్తామని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్ చెప్పారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కార్మికులకు ఆయా సంస్థలు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ప్రకాశ్‌ జవదేకర్ ఆదేశించారు. లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలోనిత్యావసర సరుకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినేట్ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. పాలు నిత్యావసర దుకాణాలు నిర్ణీత సమయంలో తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా త్వరలో జిల్లాల వారీగా హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈఎంఐలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు.