రూ.1.70లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ: నిర్మలా సీతారామన్‌

లాక్‌డౌన్‌ వేళ కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా గరీబ్‌ కల్యాణ్‌ స్కీమ్‌ పేరుతో లక్షా 70 వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. వలస కార్మికులు, పట్టణ, గ్రామీణ పేదలను ఆదుకునేలా ప్యాకేజీ రూపొందించినట్లు చెప్పారు. పేద కార్మికులను ఆదుకోవడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టామన్నారు. శానిటేషన్‌ వర్కర్లు, ఆశా, పారామెడికల్‌, వైద్యులు, నర్సులకు ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున ప్రత్యేక బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.