యాపిల్ స్టోర్‌లు నిరవధిక మూసివేత

అంతర్జాతీయంగా కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ రిటైల్‌ దుకాణాలను నిరవధికంగా మూసివేస్తున్నట్టు టెక్‌ దిగ్గజం యాపిల్‌ ప్రకటించింది. తొలుత మార్చి 27 వరకే తమ రిటైల్‌ స్టోర్లను మూసివేయనున్నామని ప్రకటించిన ఆ సంస్థ.. తాము తిరిగి ప్రకటించేంత వరకూ స్టోర్ల మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేసింది. లాస్‌ ఏంజిల్స్‌లోని ఓ యాపిల్‌ ఉద్యోగికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు యాపిల్ తెలిపింది. అటు కరోనాపై పోరాటానికి తమ వంతు సాయంగా యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ 15 మిలియన్‌ డాలర్లు ప్రకటించారు.