మూడు వారాల పాటు బ్రిటన్ లాక్‌డౌన్

కరోనా క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్రిటన్‌ ప్రభుత్వం మరిన్ని కఠిన ఆంక్షలు విధించింది. మూడు వారాల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రధాని బోరిన్‌ జాన్సన్‌ ప్రకటించారు. తప్పని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ప్రజలు అత్యసవరమైతే తప్ప గడప దాటి బయటకు రావొద్దని ఆదేశించారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠిన ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే కరోనాను ఓడించగలమని పిలుపునిచ్చారు. బ్రిటన్‌లో మృతుల సంఖ్య 335కు పెరిగింది. మరో 6 వేల 650 మంది వైరస్‌ బారిన పడ్డారు.