మీ బాఘీ 3 సెట్ కు నన్ను పిలవండి ప్లీజ్: అల్లు అయాన్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌ కు ఓ సందేశం పంపాడు. టైగర్ ష్రాఫ్ నటించిన బాఘీ, బాఘీ 2 సినిమాలంటే అయాన్ కు చాలా ఇష్టమట. దీంతో అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా అయాన్ సందేశాన్ని బాఘీ హీరోకు షేర్ చేశారు. అందులో బాఘీ 3 సెట్‌ కు తనను తీసుకెళ్లాలని టైగర్ ను అయన్ కోరాడు. హాయ్ టైగర్ స్క్వాష్.. మీ బాఘీ 3 సెట్ కు నన్ను పిలవండి ప్లీజ్ అని ముద్దుగా అడిగాడు. దాంతో అల్లు అర్జున్‌ నవ్వుతూ… ఎందుకు అని ప్రశ్నించాడు. ఎందుకంటే నేను ఆయన శరీరం, గన్ ఫైటింగ్ సీన్లు చూడాలనుకుంటున్నా అని బాబు సమాధానం ఇచ్చాడు.

అల్లు అర్జున్ షేర్ చేసిన అయాన్ వీడియోను టైగర్ షాఫ్రా చూశారు. వెంటనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్‌లో షేర్‌ చేశారు. హాహాహా.. నా కొత్త పేరు టైగర్ స్క్వాష్ నచ్చింది. కేవలం బాఘి 3 సెట్‌ కే కాదు.. నా అన్ని సినిమా సెట్‌లకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానని అయన్‌ కు చెప్పండి అల్లు అర్జున్ సర్ అని రిప్లై ఇచ్చారు. అయాన్‌ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు ఆ వీడియోను తెగ చూసేస్తున్నారు.