భారీగా తగ్గిన బంగారం ధర

కరోనా ధాటికి బంగారం ధరలు సైతం దిగివస్తున్నాయి. మహమ్మారి విజృంభణతో కొనుగోళ్లు పడిపోయిన క్రమంలో పసిడి ధర పతనమైంది. డెడ్లీ వైరస్‌ విస్తృత వ్యాప్తితో ప్రజలు నగదు నిల్వల వైపు మొగ్గుచూపడంతో చుక్కల్లో విహరించిన పడిసి ధర దిగివచ్చింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం ధర 534 రూపాయలు తగ్గి 39 వేల 710 రూపాయలకు చేరుకుంది. ఇక కిలో వెండి 534 రూపాయలు పతనమై 34 వేల 882కి పడిపోయింది.