భారత్-సౌతాఫ్రికా వన్డే సిరీస్‌ రద్దు

కరోనా ఎఫెక్ట్ క్రీడారంగంపై కూడా పడింది. కోవిడ్-19 ప్రభావంతో భారత్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ ను బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా రద్దు చేసింది. మూడు వన్డేల సరీస్‌లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అవ్వగా.. మిగతా రెండు మ్యాచ్‌లను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. మార్చి 15న లక్నో, 18న కోల్‌కతాలో తర్వాతి రెండు వన్డేలను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఆటగాళ్లు, ప్రేక్షకుల క్షేమం కోసం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.  అనంతరం మొత్తానికే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఐపీఎల్‌ ను బీసీసీఐ ఏప్రిల్‌ 15కు వాయిదా వేసింది.