భారత్‌లో ఇక ‘టెలీమెడిసిన్‌’ వైద్యసేవలు

కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశంలో టెలీమెడిసిన్‌ విధానంలో వైద్యసేవలు అందించటానికి మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మార్గదర్శకాలు జారీచేసింది. ఈ విధానంలో వీడియో సమావేశం, ఫోన్‌ సంభాషణ లేదా మెసేజ్‌ల ద్వారా వైద్యులు రోగులకు వైద్య సలహాలను అందించే అవకాశం కలుగుతుంది. భారత్‌ వంటి భారీ జనాభా ఉన్న దేశాల్లో కరోనా వైరస్‌పై పోరుకు టెలీమెడిసిన్‌ అద్భుతంగా సాయం చేయనుంది. చైనాలో కూడా ఆసుపత్రులు కిక్కిరిసన సమయంలో ఈ విధానంలో వైద్యం చేశారు.