బ్రిటన్ యువరాజుకు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి యూకేలోని రాజకుటుంబాన్ని తాకింది. 71 ఏళ్ల బ్రిట‌న్ యువ‌రాజు చార్లెస్‌కు క‌రోనా పాజిటివ్ అని బ‌కింగ్‌హాన్ ప్యాలెస్ వ‌ర్గాలు బుధ‌వారం ప్ర‌క‌టించాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన సతీమణి కామిలియాకు కరోనా నెగిటివ్ అని తేలింది. ఇప్పటికే బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్ స‌హాయ‌కురాలికి క‌రోనా సోక‌టంతో రాణి సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. తాజాగా ఆమె కుమారుడు చార్లెస్‌కు కరోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని, ఆయ‌న స్కాట్లాండ్‌లోని బాల్‌మోర‌ల్ కోట‌లో క్వారంటైన్‌లో ఉన్నార‌ని బ్రిట‌న్ అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

చార్లెస్ మార్చి 10న మొనాకో యువ‌రాజు ఆల్బ‌ర్ట్‌తో స‌మావేశామ‌య్యారు. ఆయ‌న‌కు ఐదు రోజుల త‌ర్వాత క‌రోనా సోకిన‌ట్లు నిర్దార‌ణ అయింది. బ్రిట‌న్‌లో ఇప్పటివరకు 8077 పాజిటివ్ కేసులు నమోదు కాగా… క‌రోనా వ్యాధితో ఇప్ప‌టికే 422 మంది మృత్యువాత పడ్డారు.