బీసీసీఐ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం

కరోనా వైరస్‌ బీసీసీఐని ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పటికే కరోనా  ముప్పుతో ఐపీఎల్‌ సహా దేశవాళీ క్రికెట్‌ మ్యాచులన్నీ వాయిదా వేసింది. తాజాగా ముంబైలోని ప్రధాన కార్యాలయాన్ని సైతం మూసివేస్తోంది. ఉద్యోగులందరినీ ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించింది. కరోనా కారణంగా వాంఖడే స్టేడియం దగ్గరున్న ప్రధాన కార్యాలయం మూసివేస్తున్నామని ఉద్యోగులందరికీ బీసీసీఐ తెలిపింది. కరోనాను కట్టడి చేసేందుకు జనసమ్మర్థం లేకుండా చూడాలని బీసీసీఐ సహా అన్ని క్రీడా సమాఖ్యలకు కేంద్ర క్రీడాశాఖ ఆదేశించింది. దీంతో ఏప్రిల్‌ 15 వరకు ఐపీఎల్‌ను బీసీసీఐ వాయిదా వేసింది. అంతర్జాతీయ, దేశవాళీ సిరీసులను రద్దు చేసింది.