బీఎస్‌ఎన్‌ కస్టమర్లకు శుభవార్త.. ఒక నెల ఉచితం

బీఎస్‌ఎన్‌ బ్రాండ్‌బ్యాండ్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేలా ఇప్పటికే కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. అత్యవసర సేవలు తప్ప ప్రైవేటు రంగంలోని అన్ని సంస్థలూ ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని సూచనలు చేసింది. బీఎస్‌ఎన్‌ దీనిని అవకాశంగా మలుచుకుంది. కొత్తగా కనెక్షన్లు తీసుకునే కస్టమర్లకు ఒక నెల ఉచితంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందజేస్తామని ప్రకటించింది.

ప్రస్తుతం ఉన్న ల్యాండ్‌లైన్ వినియోగదారులు, కొత్త వినియోగదారులు కాపర్ కేబుల్ కనెక్షన్ తీసుకుంటే కనీసం ఇన్‌స్టలేషన్ రుసుములూ వసూలు చేయబోమని తెలిపింది. మోడెమ్ మాత్రం కొనుగోలు చేయాలని సూచించింది.