నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. కరోనా వైరస్‌ భయాలు, క్రూడాయిల్ పతనంతో మార్నింగ్‌ సెషన్‌లో మార్కెట్లు కుదేలు అయితే.. మిడ్‌ సెషన్‌ లో కాస్త కోలుకున్నాయి. అయితే  బ్యాంక్‌ నిఫ్టీ వీక్లీ క్లోజింగ్‌ ఉండటంతో ట్రేడింగ్‌ చివరి గంటలో సూచీలు మళ్ళీ నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ 8వేల దిగువకు పడిపోయింది. సెన్సెక్స్‌ కూడా 28వేల దిగువకు పడిపోయి 38 నెలల కనిష్ట స్థాయికి పతనమైంది. మార్కెట్లు బేర్‌ గ్రిప్‌ లోకి వెళ్ళడంతో అన్ని రంగాల సూచీలు నష్టాలతో ముగిశాయి. స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌, ఆటో, క్యాపిటల్‌ గూడ్స్‌, కన్జ్యూమర్‌  డ్యూరబుల్స్‌, హెల్త్‌ కేర్‌, మెటల్స్‌, ఆయిల్‌ &  గ్యాస్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐలు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా క్లోజ్‌ అయ్యాయి. ఐటీసీ, భారతి ఎయిర్‌టెల్‌, కోటక్‌ మహీంద్రా,  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ లు టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.