ఢిల్లీలో అత్యవసర సేవలు యధాతథం

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రాలు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీని లాక్ డౌన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్. నేటి నుంచి 31 మార్చి వరకు లాక్ డౌన్ విధిస్తన్నట్లు ప్రకటించారు. అయితే ఢిల్లీలో అత్యవసర సేవలు యదావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. అంతర్జాతీయ విమానాలు, ప్రజారవాణా పూర్తిగా నిషేధించారు. ప్యాసింజర్‌ రైళ్లు, మెట్రో, ఎంఎంటీఎస్‌ సర్వీసులు బంద్‌ అయ్యాయి