టాయిలెట్ శుభ్రం చేసిన ధావన్.. ఫన్నీ వీడియో

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వేలమంది కరోనా బాధితులు ఉన్నారు. అనేక రంగాల్లో మూతబడ్డాయి. క్రీడా రంగం స్తంభించిపోయింది. ఒక్క ఒలింపిక్స్ మాత్రమే కాకుండా భారత్‌లో జరిగే ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ కూడా వాయిదా పడింది. దీంతో క్రీడాకారులు ఇళ్లకే పరిమితమయ్యారు. వారు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తున్నారు. కొన్ని వీడియోలు షేర్ చేసి అలరిస్తున్నారు. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిలో ఒక వారం కంటే ఎక్కువ రోజులు ఇంట్లో ఉంటే భర్తకు ఉండే కష్టాలను ట్విట్టర్‌లో సరదాగా చూపిస్తూ ఒక వీడియోను అప్‌లోడ్ చేశారు.

ధావన్‌ షేర్ చేసిన వీడియోలో బట్టలు ఉతుకుతుండగా తన భార్య ఆయేషా ముఖర్జీ మేకప్ వేసుకున్నారు. ఆ తర్వాత ఆమె ఫోన్ మాట్లాడుతూ కర్ర పట్టుకుని ధావన్‌తో బలవంతంగా టాయిలెట్ కడిగించింది. ప్రస్తుతం ఈ సరదా వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ప్రతి భర్త పరిస్ధితి ఇలాగే ఉందని నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.