గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టడం అభినందనీయం

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహరము స్పూర్తితో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టడం అభినందనీయమన్నారు సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రీ. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మణికొండలో తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నాకు మొక్కలన్న ,చెట్లన్న నాకు చాలా ఇష్టం. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో మొక్కలు నాటడం చాలా సంతోషానిచ్చింది. పర్యావరణానికి మొక్కలు ఎంతగానో మేలు చేస్తాయి. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించాల్సిందిగా సినీ కవి చంద్రబోస్, సంగీత దర్శకులు థమన్, సినీ హీరో రాజ్ తరుణ్ ఈ చాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధి, హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ సుబ్బరాజు పాల్గొన్నారు.