కరోనా టైటిల్స్‌ తో సినిమాలు !

ఓ వైపు కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు పోరాడుతుంటే మరోవైపు ఈ టైటిల్‌తో సినిమాలు తీయడానికి సిద్ధమయ్యారు నిర్మాతలు. దీంతో ఆ పేరు వచ్చేట్టుగా సినిమా టైటిళ్లను నమోదు చేయిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ ఈ విషయంలో ముందుంది. కరోనా ప్యార్‌ హై టైటిల్‌ను నమోదు చేయించుకుంది. అంతేకాదు దీనికి సంబంధించిన స్క్రిప్టు పనులు కూడా మొదలు పెట్టింది. మరికొందరు నిర్మాతలు సైతం కరోనా పేరుతో కూడిన టైటిల్స్‌ ను నమోదు చేసుకున్నారని ఇండియన్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ వెల్లడించింది. అటు కరోనా ఎఫెక్ట్‌ వల్ల ఇప్పటికే పలు సినిమాల విడుదల తేదీలు వాయిదా పడ్డాయి.