కరోనాపై పోరాటానికి ఫెదరర్‌ రూ.7.75 కోట్లు సాయం

కరోనా వైరస్‌పై పోరాటం కోసం స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌  7 కోట్ల 75 లక్షల  రూపాయల విరాళం ఇచ్చాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచంలో కరోనా వల్ల అత్యంత ప్రభావితమైన దేశాల్లో స్విట్జర్లాండ్‌ తొమ్మిదో స్థానంలో ఉంది. అక్కడ 8 వేల 800 మంది కరోనా బారిన పడగా.. 86 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో వ్యాపార, క్రీడా, సినీ ప్రముఖులు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుండగా.. ఫెదరర్‌ కూడా ఈ జాబితాలో చేరాడు. మరోవైపు పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో, అతడి ఏజెంట్‌.. కరోనా బాధితుల కోసం తమ హోటల్లో రెండు ఐసీయూ వార్డులు తీర్చిదిద్ది ప్రభుత్వానికి అప్పగించారు.