ఒలింపిక్స్‌ 2020 వాయిదా

కరోనా ప్రభావంతో ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ 2020 వాయిదా పడింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఒలింపిక్స్‌ ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య ప్రకటించింది. జపాన్ ప్రధాని షింజో అబే విజ్ఞప్తితో ఒలింపిక్స్‌ ను ఒక సంవత్సరం పాటు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. కాగా ఇప్పటికే కరోనా ప్రభావంతో ఒలింపిక్స్‌ ను వాయిదా వేయాలని సభ్యదేశాలు ఒత్తిడి తెచ్చాయి.