ఎంసెట్, ఈసెట్ గడువు పొడిగింపు

తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ 2020కు సంబంధించి దరఖాస్తుల గడువు పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఎంసెట్‌ దరఖాస్తు గడువును ఏప్రిల్‌ 7వ తేదీ వరకు పొడిగించగా… ఈసెట్‌ దరఖాస్తు గడువును ఏప్రిల్‌ 5వ తేదీ వరకు పొడిగించారు. కాగా… ఎంసెట్‌ దరఖాస్తు గడువు మార్చి 30తో ముగియనుండగా… ఈసెట్‌ దరఖాస్తు గడువు ఈ నెల 28 న ముగియనుంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో.. ఏప్రిల్‌ 7 వరకు ఎంసెట్‌, ఈసెట్‌ దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.