ఈ నెల 19 నుంచి ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ షాపింగ్ డేస్’

దేశీయ ప్రముఖ ఈ-కామర్స్‌ ఫ్లిప్‌కార్ట్‌ మరో బిగ్ సేల్‌కు సిద్ధమైంది. ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు బిగ్‌ షాపింగ్‌ డేస్‌ పేరిట కొత్త సేల్‌ను ప్రారంభించనుంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్పీకర్స్‌, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై ఆఫర్లు అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రెడిట్‌ కార్డు యూజర్లకు ఈ సెల్‌లో 10శాతం అదనపు డిస్కౌంట్‌ అందించనుంది.

గూగుల్‌ పిక్సల్‌ 3ఏని రూ.26,999, శాసంగ్‌ గెలాక్సీ ఎస్‌9 రూ.21,999, శాంసంగ్‌ గెలాక్సీ ఏ50 రూ.12,999, ఒప్పో రెనో 10ఎక్స్‌ జూమ్‌ రూ.24,990, అనూస్‌ 6జన్‌ రూ.23,999, రెడ్‌మీ నోట్‌ప్రో రూ.11,999, రియల్‌మీ 5 ప్రో రూ.11,999, వివో జడ్‌1 ప్రో రూ.11,990కి విక్రయించనున్నారు. దీంతో పాటు యాపిల్‌ ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌ 64జీబీ వేరియంట్‌ రూ.52,999కే లభించనుంది. ఈ ఆఫర్లతో పాటు నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా కల్పించింది. పాత ఫోన్లకు ఎక్చ్సేంజ్‌పై అదనపు డిస్కౌంట్‌ అందిస్తోంది.