ఈడీ ముందుకు అనిల్ అంబానీ

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. ఎస్‌ బ్యాంకు మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీని అధికారులు ప్రశ్నించారు. ఎస్‌ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారడంపై ఆరా తీశారు.  ఆ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణాకపూర్‌ తో ఆర్థిక లావాదేవీలపై కూడా అనిల్ అంబానీని ప్రశ్నించారు ఈడీ అధికారులు