ఈఎంఐలను వాయిదా వేసేలా చర్యలు తీసుకోండి: సోనియా

కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ వెల్లడించారు. ఈమేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి  లేఖ రాశారు. కరోనా వైరస్‌ లక్షలాదిమంది జీవితాలను ప్రమాదంలో పడేసిందన్నారు. కరోనా మహమ్మారిపై విజయానికి దేశం ఒక్కతాటిపై నిలిచి పోరాడాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ నివారణ చర్యలకోసం కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశ వ్యాప్తంగా సరకు రవాణాను సులభతరం చేయాలన్నారు. బ్యాంకుల ఈఎంఐలను వాయిదా వేసేలా చర్యలు తీసుకోవా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.