ఇరాన్‌లో అంతకంతకూ పెరుగుతున్న కరోనా మృతులు

ఇరాన్ రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా మరణాలతో మరుభూమిని తలపిస్తోంది. ఆసియాలో ప్రతి పది కరోనా మరణాల్లో తొమ్మిది ఇక్కడే నమోదవుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 157మంది కరోనాకు బలికాగా ఇప్పటివరకు దేశంలో 2234మంది మృతి చెందారు. దీంతో చైనా తర్వాత ఆసియాలోనే అత్యధిక మరణాలు సంభవించిన దేశంగా నిలిచింది ఇరాన్‌. పాజిటీవ్‌ కేసులు 30వేలకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 19న తొలి కరోనా కేసు నమోదైతే.. ప్రభుత్వం  దాన్ని దాచిపెట్టింది. తరువాత కేసుల సంఖ్య అంతకంతకు పెరిగి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  నష్టమంతా జరిగాక ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.