ఆరు సూత్రాలు పాటిస్తే చాలు…కరోనా రాదు….!

కరోనా వైరస్‌పై సినీ హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ వీడియో విడుదల చేశారు. కరోనా వైరస్‌ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. డబ్ల్యూహెచ్‌వో సూచించిన ఆరు సూత్రాలు పాటిస్తే కరోనా వైరస్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. వైరస్‌ వ్యాప్తి తగ్గే వరకు తెలిసిన వారిని కౌగిలించుకోవడం, షేక్‌హ్యాండ్స్‌ ఇవ్వడం, మానేయాలని.. ప్రభుత్వం ఇచ్చే సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలని కోరారు.