అన్నీ చెల్లింపులపై రుసుంను 18 నుంచి 9 శాతానికి తగ్గింపు

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ  ప్రజలకు కొన్ని వెసులుబాట్లను కల్పించింది. 2018-19 ఐటీ రిటర్న్ ఫైలింగ్ ను జూన్ 30 వరకు పొడిగించింది. అలాగే ఆధార్-పాన్ కార్డు అనుంసంధానాన్ని జూన్ 30 వరకు పొడిగించింది. అన్నీ చెల్లింపులపై రుసుంను 18 శాతం నుంచి 9 శాతానికి తగ్గించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశంలో ఎగుమతులు, దిగుమతులపై నిషేధం విధించినట్లు నిర్మలా తెలిపారు. అత్యవసర దిగుమతులపై కస్టమ్స్ అధికారులు 24 గంటలు పర్యవేక్షిస్తారని అన్నారు. ఎలాంటి రుసుము లేకుండా డెబిట్ కార్డు ద్వారా ఏ బ్యాంకులోనైనా నగదును విత్ డ్రా చేసుకోవచ్చని సీతారామన్ వెల్లడించారు. ఈ అవకాశం వచ్చే మూడు నెలలు వర్తిస్తుందని అన్నారు.