బీజేపీలో చేరిన వీరప్పన్ కూతురు…

గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణి బీజేపీలో చేరారు. తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. పార్టీ జనరల్ సెక్రెటరీ మురళీధర రావు, కేంద్ర మాజీ మంత్రి పోన్ రాధాకృష్ణన్ ఆమెను సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం పాటుపడతానని వీరప్పన్‌ కూతురు విద్యారాణి వాగ్దానం చేసింది. తన తండ్రికి కూడా ప్రజలకు సేవ చేయాలని ఉండేదని అయితే ఆయన తప్పుడు మార్గంలో పయనించారని ఆమె వ్యాఖ్యానించారు.