వన్డే మ్యాచ్‌: 35 పరుగులకే ఆలౌట్!

ఐసీసీ క్రికెట్ చరిత్రలో వన్డేల్లో అత్యల్ప స్కోరు నమోదైంది. ఐసీపీ ప్రపంచ కప్‌ లీగ్‌ లో భాగంగా నేపాల్-అమెరికా జట్ల మధ్య వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో కేవలం 12 ఓవర్లు ఆడిన అమెరికా.. 35 పరుగులకే ఆలౌటయింది. ఐసీసీ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు. తొలుత టాస్ గెలిచిన నేపాల్‌.. బ్యాటింగ్‌ అమెరికాకు ఇచ్చింది. అమెరికన్ బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్ గ్జేవియర్ మార్షల్ మాత్రమే రెండంకెల స్కోరు(16)ను నమోదు చేశాడు, మిగతావారిలో ఎవరూ కూడా కనీసం ఐదు పరుగులు చేయలేకపోయారు. నేపాల్ బౌలర్లలో సందీప్ లామిచానే 16 పరుగులకు 6 వికెట్లు తీయగా, సుశాన్ బారి 5 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో భాగంగా నేపాల్ 5.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

ఇక.. గతంలో అతి తక్కువ పరుగులు చేసిన రికార్డు జింబాబ్వే పేరిట ఉండేది. 2004లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే కేవలం 18 ఓవర్లలో 35 పరుగులు చేసి ఆలౌటైంది. తాజాగా అమెరికా… అదే 35 పరుగులు చేసి జింబ్వాంబేతో సమానంగా నిలిచింది.