ఇమిగ్రేషన్ వ్యవస్థ ఏర్పాటుకు సిద్ధమైన బ్రిటన్

ఈయూ నుంచి వైదొలగిన బ్రిటన్‌ నూతన వీసా, ఇమిగ్రేషన్‌ వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. దీనికి సంబంధించిన వ్యవహారాలకు ప్రధాని బోరిస్‌ జాన్సన్, హోంమంత్రి ప్రీతి పటేల్‌ తుదిమెరుగులు దిద్దినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా నిపుణులను భారత్‌ సహా ప్రపంచ నలుమూలల నుంచి రప్పించుకోవచ్చని బ్రిటన్‌ భావిస్తోంది. గత వారం జరిగిన సమావేశంలో యూకే మైగ్రేషన్‌ అడ్వైజరీ కమిటీ సూచించిన సలహాలను ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుంది. మరో నాలుగు రోజుల్లోనే వీసాల వ్యవహారానికి సంబంధించిన వివరాలను ప్రీతి పటేల్‌ వెల్లడించే అవకాశాలున్నాయి.