గోపన్‌పల్లి భూ వ్యవహారంలో డిప్యూటీ కలెక్టర్ సస్పెండ్…

గోపన్‌పల్లి భూముల అవకతవకల వ్యవహారంలో డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా హైదరాబాద్‌ విడిచి వెళ్లరాదని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఈ సస్పెన్సన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే… శ్రీనివాస్‌ రెడ్డి శేరిలింగంపల్లి తహశీల్దారుగా ఉన్న సమయంలో రేవంత్‌రెడ్డికి అనుకూలంగా వ్యవహరించాడు. నిబంధనలకు విరుద్ధంగా సర్వే నెంబర్ 127లోని.. 6 ఎకరాల 24 గుంటల భూమిని తప్పుడు పత్రాలతో శ్రీనివాస్‌ రెడ్డి మ్యూటేషన్ చేశాడు. తప్పుడు డాక్యుమెంట్లతో ఈ భూమిని రేవంత్ రెడ్డి సోదరులు కొనుగోలు చేశారు. ఈ అవకతవకల వ్యవహారంలో శ్రీనివాస్ రెడ్డి.. రేవంత్ సోదరులకు అనుకూలంగా వ్యవహరించినట్టు తేలింది. దీంతో శ్రీనివాస్ రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.