మిస్టర్ ప్రెసిడెంట్ టూర్ కోసం భారీ భద్రత…!

డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారైంది. ఈనెల 24 నుంచి మూడు రోజులపాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మిస్టర్ ప్రెసిడెంట్ సెక్యూరిటీపై భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రంప్ భద్రత కోసం ఏకంగా వైట్ హౌజ్ కదిలి వస్తోంది. మిస్టర్ ప్రెసిడెంట్ ఇండియా టూర్ డేగ కళ్ల నిఘాలో కొనసాగనుంది.

టెక్నాలజీని అడ్డాన్స్ డ్ స్టేజ్ లో యూజ్ చేయడంలో అమెరికా తర్వాతే ఎవరైనా..! ట్రంప్ భద్రతకు అమెరికా వందల కోట్లు ఖర్చు చేస్తుంది. మిస్టర్ ప్రెసిడెంట్ ఏ దేశ పర్యటనకు వెళ్లినా..తన సెక్యూరిటీ వింగ్ తోపాటు దాదాపు వైట్ హౌజ్ మొత్తం తన వెంట ఉంటుంది. ప్రపంచదేశాలకు పెద్దన్నగా వ్యవహరించే అమెరికా అధ్యక్షుడి భద్రత విషయంలో మరింత అడ్వాన్స్‌డ్ గా ఉంటారు. దీనికి ఆయన ఉపయోగించే కారే అందుకు నిదర్శనం. అమెరికా భద్రతాదళాలు సమకూర్చే ఈ కారును మినీ వైట్ హౌజ్ గా అభివర్ణిస్తుంటారు. వైట్ హౌజ్ లో డీల్ చేయాల్సిన అఫీషియల్ ఫైల్స్ సహా అమెరికా నలుమూలల్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా సకల సౌకర్యాలు అందులోనే వుంటాయి.

యూఎస్ ప్రెసిడెంట్ ప్రయాణించే కారు పేరు.. ద బీస్ట్..! కారును క్యాడిలాక్ వన్, ఫస్ట్ కార్ అనే పేర్లతోనూ పిలుస్తారు. దీని టెక్నాలజీ హైరేంజ్ ఉంటుంది. దీని భద్రత మోస్ట్ హై రేంజ్ లో ఉంటుంది. ట్రంప్ సెక్యూర్డ్ కార్ 1.2ఎం క్యాడికాల్ రకానికి చెందినది. ఈ కారు డోర్స్ మందం 8 అంగుళాలు ఉంటుంది. శత్రు మూకల బాంబు దాడులను సైతం తట్టుకునే ఈ హైటెక్ వాహనాన్ని సీక్రెట్ సర్వీస్ సిబ్బంది.. ద బీస్ట్ గా వ్యవహరిస్తుంది. ఇవే కాదు..శత్రుదుర్బేధ్యమైన అనేక ప్రత్యేకతలు బీస్ట్ సొంతం. బుల్లెట్ ప్రూఫ్ టెక్నాలజీతో అత్యంత మందంతో కూడిన మెటీరియల్, గ్లాస్‌తో ఈ కారును డిజైన్ చేశారు. ఈ కారుకు సంబంధించిన ప్రతీ అంశం గోప్యంగానే ఉంటుంది. అమెరికా కేంద్ర నిఘా సంస్థ…సీఐఏ ఎంపిక చేసిన సీక్రెట్ ఏజెంట్ మాత్రమే ఈ కారుని నడిపిస్తారు. మిగిలిన వారికి ఈ కారును కనీసం ముట్టుకునేందుకు కూడా అవకాశం ఉండదు. శత్రు చేతికి చిక్కని వేగం ఈ బీస్ట్ సొంతం. అయితే విపత్కర పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం సంభవించినా..దాడి కారణంగా బీస్ట్ టైర్లు పేలినప్పటికీ.. కారుకు ఎలాంటి హానీ కలుగదు. శక్తివంతమైన బాంబులు బీస్ట్ కు సమీపంలోనే పేలినా లోపల ఉన్న ప్రెసిడెంట్ వెంట్రుక కూడా కదలదు. ఈ బీస్ట్ మరో ప్రత్యేకత ఏంటంటే.. రసాయన ఆయుధ దాడిని కూడా తట్టుకోగల సామర్ధ్యం దీని సొంతం.

అత్యంత కాన్ఫిడెన్షియల్ గా జరిగే ఈ బీస్ట్ మేకింగ్ ను జనరల్ మోటార్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉంటుంది. బీస్ట్ ను పోలిన మరో 12 కార్లు దేశాధినేత కాన్వాయ్ లో ఉంటాయి. ఇంతటీ మోస్ట్ సెక్యూర్డ్..కార్ల ఖరీదు అక్షరాల వంద కోట్ల రూపాయలు. అయితే ఇప్పటివరకు ప్రపంచ దేశాధినేతలు వినియోగించే కార్ల భద్రత కంటే.. అత్యంత సురక్షితమైన కార్లు ఇవేనని అంటారు. ఒక్కో కారు బరువు 8 టన్నులు ఉంటుంది. బోయింగ్-757 విమానానికి ఉంటే డోర్స్ కు ఏమాత్రం తగ్గని నాణ్యత ఈ బీస్ట్ కారు డోర్స్ కు ఉంటుంది. ఈ బీస్ట్ కు ఉన్న డోర్స్ జీవ, రసాయన దాడులను సైతం తట్టుకొనే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇక..కారు అద్దాల విషయానికి వస్తే..వీటి మందం ఐదు అంగుళాలు ఉంటుంది. దీనికి అమర్చిన అద్దాలు బుల్లెట్లను అడ్డుకుంటాయి. ఈ బీస్ట్ కారు దుర్భధ్యమైన భద్రతకు మరో మచ్చుతునక ఏంటంటే…ఈ కారు కింది భాగం కూడా అత్యంత పటిష్ఠంగా ఉంటుంది. కారు అడుగు భాగాన బాంబు పేలినా కారుకు గానీ, ఇంధన ట్యాంకుకు గానీ ఎలాంటి నష్టం కలుగదు. కనీసం కారులో కుదపు కలిగినట్టు కూడా తెలియదు. క్లిష్ట పరిస్థితుల్లో దాడి చేయాలనుకుంటే..డ్రైవర్‌కు సీటు పక్కన, అటు డోర్ వద్ద ప్రయోగించడానికి అనువుగా అత్యాధునిక ఆయుధాలు సిద్ధంగా ఉంటాయి.

మిస్టర్ ప్రెసిడెంట్ వినియోగించే..ఈ బీస్ట్ కారు ముందుభాగంలో కూడా దాడిని నివారించే కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయి. ముందు భాగంలో ఉండే..బంపర్ల వద్ద టియర్ గ్యాస్ గ్రెనేడ్ లాంచర్లు ఉంటాయి. నిరసనకారులు కానీ, శ్రతువులు కానీ ఇంకెవరైనా.. కారు ఆపేందుకు ప్రయత్నిస్తే వెంటనే.. కారులోంచే బాష్పవాయువును ప్రయోగించవచ్చు. హెడ్‌లైట్ల పక్కనే నైట్ విజన్ కెమెరాలు ఉంటాయి.ఇవీ పూర్తిగా నిఘాను ఎప్పటికప్పుడు కారులో ఉన్న సిస్టమ్ కు, ఆఫీసర్లకు సమాచారం అందజేస్తాయి. వెనుక భాగంలో ఫైర్ టూల్స్ ఉంటాయి. కారు డ్రైవర్‌కు ప్రత్యేకంగా అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు శిక్షణ ఇస్తారు. క్లిష్టపరిస్థితులు తలెత్తినప్పుడు 180 డిగ్రీల జె టర్న్‌తో కారును తప్పించగల సామర్థ్యం కూడా ఉంటుంది. డ్రైవర్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డాష్ బోర్డులో కమ్యూనికేషన్ సెంటర్, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటాయి. కారులోనే చిన్నపాటి సెల్ టవర్ కూడా ఉంటుంది.

అమెరికా అధ్యక్షుడికి భద్రత పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు సిబ్బంది. ప్రెసిడెంట్ తీసుకునే ఆహారం బాధ్యత కూడా ఆయన సెక్యూరిటీ సిబ్బందే చూసుకుంటారు. ఈ బీస్ట్ లో ట్రంప్ బ్లడ్ గ్రూప్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. అందుకే తమ అధినేత కోసం శత్రుదుర్భేధ్యమైన కారును రూపొందిస్తుంది సెక్యూరిటీ.