తాజ్‌మహల్‌ను సందర్శించనున్న ట్రంప్‌…

మొదటిసారి భారత పర్యటనకు వస్తున్న.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్, ఢిల్లీ, అగ్రాలో పలు ప్రాంతాలను సదర్శించనున్నారు. ట్రంప్ దంపతుల పర్యటన నేపథ్యంలో తాజ్‌మహల్‌ తో పాటు అగ్రా నగరాన్ని సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ట్రంప్ పర్యటనకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈనెల 24న ట్రంప్ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు. ఢిల్లీలో ట్రంప్ భారత పార్లమెంటుపై ప్రసంగించనున్నారు. అప్పట్లో భారత్ పర్యటించిన అమెరికా అధ్యక్షుల్లో 1959లో డ్వైట్ ఎసెన్ హోయర్, 2000లో బిల్ క్లింటన్, 2010లో బరాక్ ఒబామా మాదిరిగా ట్రంప్ ప్రసంగించనున్నారు. ఢిల్లీలో బస చేసిన తర్వాత ట్రంప్ ఈనెల 24న ఆగ్రాకు బయల్దేరనున్నారు. అక్కడి చారిత్రక కట్టడం తాజ్ మహల్ ను ఆయన సందర్శించనున్నారు. ప్రపంచ నేతలు ఎవరు భారత్ వచ్చినా తిరిగి స్వదేశానికి వెళ్లే ముందు ఈ ప్రాంతాన్ని సందర్శిచి కాని వెళ్లరు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో హౌస్టన్ లో జరిగిన హౌడీ మోడీ ఈవెంట్ లో మోదీతో పాటు ట్రంప్ కూడా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి 50వేల మంది వరకు హాజరయ్యారు.

అగ్రా పర్యటన తర్వాత గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటించనున్నారు. ట్రంప్ మూడు గంటల పర్యటన కోసం కోట్లను ఖర్చు చేస్తున్నారు. ఇందులో అధికశాతం అహ్మదాబాద్ నగరపాలక సంస్థ, అహ్మదాబాద్ పట్టణాభివృద్ధి సంస్థలు భరించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం 14 కోట్ల రూపాయలను మాత్రమే అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. వీటిని నగర సుందరీకరణ కోసం ఖర్చు చేస్తున్నారు. కొత్త రోడ్ల ఏర్పాటు, రోటడ్ల మరమ్మతుకు 80 కోట్ల రూపాయలు, ట్రంప్ భద్రతకు 12 కోట్ల నుంచి 15 కోట్లు వెచ్చిస్తున్నారు. మోటేరా స్టేడిమంలో దాదాపు లక్ష మంది అతిథుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం 7 కోట్ల నుంచి 10 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. రోడ్ల మధ్యలో ఈత జాతి చెట్ట ఏర్పాటుకు 6 కోట్లు, మోదీ-ట్రంప్ రోడ్ షో వెంబడి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం నాలుగు కోట్లను ఖర్చు చేయనున్నారు. సుమారు పది వేలమంది పోలీసులతో పటిష్టమైన నిఘా, రక్షణచర్యలను చేపట్టనున్నారు.