వరుసగా నాలుగో రోజు నష్టాల్లో మార్కెట్లు…

చైనాను వణికిస్తున్న రాకాసి కొవిడ్‌-19… ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతోంది. ఆ ప్రభావం భారత స్టాక్‌ మార్కెట్లపైనా పడుతోంది. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు నాలుగో రోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి 392 పాయింట్లు నష్టపోయి 39,888కి పడిపోయింది. నిఫ్టీ 199 పాయింట్లు కోల్పోయి 11,678 వద్ద ముగిసింది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 520 పాయింట్లకు పైగా పతనమైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాల్లో ముగియగా… సన్ ఫార్మా, మారుతి సుజుకి, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.