కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు….

భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి నష్టాల్లో కొనసాగిన మార్కెట్లు.. ముగిసే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. ట్రంప్ పర్యటన కూడా వాణిజ్యపరంగా ఎలాంటి ఆశావహ వాతావరణాన్ని సృష్టించలేకపోయింది. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి… బీఎస్ఈ సెన్సెక్స్ 806 పాయింట్ల నష్టంతో 40,363 వద్ద ముగియగా, నిఫ్టీ 251 పాయింట్ల నష్టంతో 11,829 వద్ద స్థిరపడింది. ఖనిజ సంబంధ షేర్లు 5 శాతం నష్టాలు చవిచూడగా, ఆటోమొబైల్ పరిశ్రమ షేర్లు 3 శాతం నష్టాలు ఎదుర్కొన్నాయి. టాటా స్టీల్, హిందాల్కో, వేదాంత, మారుతి సుజుకి 4 నుంచి 6 శాతం నష్టపోయాయి. ఇక, రూపాయితో మారకం విలువ… రూ. 71.95 వద్ద కొనసాగుతోంది.