నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్‌ ఆరంభం నుంచే నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 152 పాయింట్లు నష్టపోయి 41,170 పాయింట్ల దగ్గర.. నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయి 12,080 పాయింట్ల దగ్గర ముగిసింది. యూఎస్‌ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 71.63 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఎస్బీఐ, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఓఎన్జీసీ షేర్లు లాభాలు పొందాయి. ఇక సిప్లా, ఏషియన్‌ పెయింట్స్‌, హిందుస్థాన్‌ యూనిలివర్‌, టీసీఎస్, హిందుస్థాన్‌ పెట్రోలియం షేర్లు నష్టాల్లో ముగిశాయి.