ఒలింపిక్స్‌పై మరో 3 నెలల్లో నిర్ణయం :ఒలింపిక్ కమిటీ

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోన్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. అయితే.. ఈ టోర్నీ నిర్వహణపై తుది నిర్ణయం మరో మూడు నెలల తర్వాత తీసుకుంటామని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ప్రకటించింది. ఒలింపిక్స్‌ ఏర్పాట్లు చేసేందుకు.. కనీసం రెండు నెలల సమయం అవసరమని తెలిపింది. అయితే ఒలింపిక్స్‌ కు ఇంకా అయిదు నెలల సమయం ఉందని వెల్లడించింది. అప్పుడే నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఆటగాళ్లు తమ క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించింది.