ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి…

సంగారెడ్డి జిల్లాలోని గుమ్మిడిదల మండలం అన్నారం గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామ శివారులోని కొత్తకుంట చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మృతులు సందీప్, మహిపాల్, పల్లవ్ కుమార్ లుగా గుర్తించారు. వీరు అన్నారం కేంద్రీయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్నారు. మృతుల్లో ఇద్దరిది అన్నారం గ్రామం కాగా, మరొకరిది సురారం గ్రామం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు శవాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.