మహా శివరాత్రి ఉత్సవాలకు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం…

ఈ నెల 21న మహా శివరాత్రి పండగ ఉన్న విషయం తెలిసిందే. వేములవాడలో గల రాజరాజేశ్వరీ దేవస్థానంలో మహా శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగతాయి. కాగా, మహా శివరాత్రి ఉత్సవాలకు హాజరవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, ఆలయ ఈవో, పూజారులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఆహ్వాన పత్రం అందజేశారు. అనంతరం పూజారులు ముఖ్యమంత్రిని ఆశీర్వదించి.. స్వామివారి ప్రసాదం, పట్టు వస్ర్తాలు అందజేశారు. వారి ఆహ్వానాన్ని స్వీకరించిన సీఎం కేసీఆర్.. స్వామివారి మహోత్సవాలకు తప్పకుండా హాజరవుతానని తెలిపారు.