రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు కీలక సూచనలు…

రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. నేతల నేరచరితపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు… కేసులున్న ఎమ్మెల్యేలు, ఎంపీల వివరాలను తెలుపాలని ఆదేశించింది. క్రిమినల్ కేసులు ఉన్న ప్రజాప్రతినిధుల వివరాలను సమర్పించాలని పార్టీలను కోరింది. నేతలపై ఎన్ని కేసులు ఉన్నాయో జాబితా ఇవ్వాలని ఆదేశించింది. నేతలపై కేసులు ఉన్నాయని న్యూస్ పేపర్లు, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న క్రిమనల్స్ కు పార్టీలు టికెట్లు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. క్రిమినల్ నేతలకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు తెలుపాలని స్పష్టంచేసింది. అటు.. తమ నాయకులు నేతలపై ఉన్న క్రిమినల్ కేసులను ఆయా రాజకీయపార్టీలు తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని పార్టీలకు సూచించింది. ఇందుకు 48 గంటల పాటు సమయం ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే జాబితాను ఎన్నికల సంఘానికి సమర్పించేందుకు 72 గంటలు గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు.