వినయ్ శర్మ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు…

నిర్భయ కేసు దోషులకు సుప్రీం కోర్టు ఝలక్ ఇచ్చింది. దోషి వినియ్‌ శర్మ వేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం శుక్రవారం తిరస్కరించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడంపై వినయ్ శర్మ సుప్రీం కోర్టు ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. పిటిషన్‌ను తోసిపుచ్చింది. చట్టంలో ఉన్న లోసుగులను వంతెనాగా వేసుకుని… ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా డెత్‌ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత కూడా రెండు సార్లు ఉరిశిక్ష వాయిదా పడింది. ఇక, నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరితీయాలంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది.