హింసాకాండపై విచారణ మార్చి 23కు వాయిదా…

షాహిన్‌బాగ్‌, ఈశాన్య ఢిల్లీ ఘటనలపై సుప్రీంకోర్టు విచారణను వచ్చే నెల 23కు వాయిదా వేసింది. ఢిల్లీ హైకోర్టులో కేసు ఉన్నందున పిటిషన్‌పై విచారణకు నిరాకరించిన సుప్రీం.. హైకోర్టు విచారణను ముందుకు సాగనివ్వాలని పిటిషనర్లకు సూచించింది. ఆందోళనల్లో 20 మంది మృతి చెందడం దురదృష్టకరమన్న సుప్రీంకోర్టు… ఢిల్లీ పోలీసుల తీరును తప్పుపట్టింది. ఢిల్లీ పోలీసులు సమర్ధవంతంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.