భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల విషయంలో సుప్రీం కోర్టు టెలికాం సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ ప్రభావం మార్కెట్లపై పడింది. దీంతో సెన్సెక్స్‌ 202 పాయింట్లు నష్టపోయి 41వేల 257వద్ద ముగిసింది. నిఫ్టీ 61 పాయింట్లు నష్టపోయి 12వేల113 వద్ద స్థిరపడింది. భారతీ ఎయిర్‌టెల్‌, యస్‌బ్యాంక్‌, యూపీఎల్‌, బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ షేర్లు లాభపడగా.. గెయిల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు నష్టపోయాయి.