లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం రోజు లాభాల్లో ముగిశాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో వరుసగా రెండు రోజులు నష్టాలను చవిచూసిన మార్కెట్లు మంగళవారం నాడు మళ్లీ లాభాల బాటపట్టాయి. చైనా పరిశ్రమల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు నెమ్మదిగా మళ్లీ విధుల్లోకి వస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో… ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 237 పాయింట్లు లాభపడి 41,216కి పెరిగింది. నిఫ్టీ 79 పాయింట్లు పుంజుకుని 12,110కి చేరుకుంది. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 71.30 వద్ద కొనసాగుతోంది. కాగా… ఎన్టీపీసీ, గెయిల్ లిమిటెడ్, మారుతి సుజుకి, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఆటో, భారతీ ఇన్‌ ఫ్రా, అల్ట్రాటెక్ సిమెంట్ సంస్థలకు సంబంధించిన షేర్లు నష్టాల్లో ముగిశాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, భారతి ఎయిర్ టెల్, నెస్లే ఇండియా, టీసీఎస్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో ముగిశాయి.